blog single post
Headlines

2019-01-08 11:17:20

బ్రిటన్ మాజీ ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ రోజు అమరావతిలోని సచివాలయానికి వచ్చిన టోనీ బ్లెయిర్‌కు చంద్రబాబు స్వాగతం పలికారు. తరువాత ఆయనతో జరిగిన సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తీరు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను వివరించారు.2022నాటికి దేశంలో 3 అత్యుత్తమ రాష్ట్రాల్లో ఏపీ ఉండాలన్న లక్ష్యంతో  పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏడు మిషన్లు ఏర్పాటు చేసుకున్నామని వాటిని సాధించడానికి గ్రిడ్‌లు ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరించారు. పవర్‌ గ్రిడ్‌ ద్వారా అందరికీ విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, గ్యాస్‌ గ్రిడ్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు.ప్రతి ఇంటికీ 15 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో అంతర్జాలం అందిస్తున్నామని చెప్పారు. టీవీ కనెక్షన్‌, టెలీఫోన్‌ సేవలు కేవలం 2 డాలర్లకే ఇస్తున్నామన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియచేసారు.