blog single post
Headlines

2019-01-08 11:06:08

కర్నూలు లో విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం నారా చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. మొదట కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు . అలానే సౌరవిద్యుత్ కోసం అల్ట్రా మెగా సోలార్ పార్క్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.తదుపరి  స్టేట్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్, ఫార్మా క్లస్టర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు.కాగా దీని తరువాత ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు  పారిశ్రామికవేత్తలతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు.కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కోసిగి ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగే జన్మభూమి-మా ఊరు  కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు.ఈ నేపథ్యంలోనే రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు.కాగా తదుపరి మధ్యాహ్నం నుండి ఢిల్లీ వెళ్లనున్నారు.