blog single post
Headlines

2019-01-07 04:56:41

అదృష్టవశాత్తు మోదీ ప్రధాని అయ్యాడు:సీఎం చంద్రబాబు

నిడదవోలులో పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…అదృష్టం కలిసి వచ్చి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు అని విమర్శించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం అన్న క్యాంటిన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండే కోడి కత్తి కేసు పై జాతీయ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయనున్నారు.కాగా గుజరాత్‌ అల్లర్ల కేసులో నాడు సీబీఐ విచారణను మోదీ అడ్డుకున్నారు అని సీఎం అన్నారు.అయితే నా కుటుంబ సభ్యులు హెరిటేజ్‌ను పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు అని తెలిపారు.నేను కంపెనీలు చూసుకోవాలని లోకేష్‌కు సూచించాను.కానీ ప్రజాసేవ కోసం రాజకీయాలకు వస్తానని లోకేష్ చెప్పారు.నా కుటుంబం పై ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరం అని చెప్పారు.నాకు ప్రధాని కావాలన్న కోరిక ఏ మాత్రం లేదు.ప్రత్యేక హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం.రేపు మరోసారి ఢిల్లీ వెళ్తాను...ఇతర పార్టీల నేతలను కలుస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.