blog single post
Headlines

2019-01-07 04:07:11

త్వరలో ఉచితంగా వైఫై ని అందివ్వనున్న ఏపీ ప్రభుత్వం

ఏపీలో నగరాల్లో ఉచితంగా వైఫై సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.కాగా వచ్చేనెల 15 నాటికి అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఏపీలోని 110 మున్సిపాలిటీల్లోని 970 ప్రాంతాల్లో ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.అయితే ఆంధ్రప్రదేశ్ డిజిటల్‌ ఇన్‌ఫ్రా, ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు నగరాల్లో వైఫై సేవలను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకువచ్చేందుకు ఆ దిశగా అడుగులు వేస్తోంది.కాగా ఫిబ్రవరి నెల 15 తేదీ నాటికి అన్ని మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో వైఫై ఉచిత సేవలు అందనున్నాయి.కాగా గూగుల్‌ సంస్థ సహకారంతో ఏపీ ప్రభుత్వం ఈ వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో 5జీ సేవలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ముందుస్తుగా వైఫై సేవలను అందుబాటులోకి తెస్తోంది.

ఆంధ్రప్రదేశ్ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకు పలుసేవలను సులభంగా అందిస్తోంది.అయితే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇంటర్నెట్‌ సాయంతో కార్యకలాపాలు ఈజీగా చేపట్టేలా పట్టణాల్లో ప్రభుత్వం ఉచిత వైఫై సేవలను కూడా అందుబాటులోకి తెస్తుండడంతో పట్టణ ప్రజానీకం నుండి ఆనందం వ్యక్తమవుతోంది.