blog single post
Headlines

2019-01-07 01:05:23

మార్చి తొలి వారం నుండి మంగళగిరి ఎయిమ్స్ లో ఓపీ వైద్య సేవలు..!

ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మరియు  చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అతిత్వరలో అత్యున్నతప్రమాణాలు కలిగిన  వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో ఓపీ సేవలు మార్చి తొలి వారంలో ప్రారంభం కాబోతున్నాయి. ఒకే భవనంలో 12 విభాగాల్లో ఈ సేవలు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణుల నియామకాలు వేగంగా  సాగుతున్నాయి.2020 ఆగస్టుకు ఎయిమ్స్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి కృషి చేస్తున్నారు.ఓపీ రోగులకు రక్త పరీక్షలు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌, ఇతర పరీక్షలు చేసేందుకు పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పరీక్షలు, మందులు బయటి మార్కెట్‌తో పోలిస్తే 50 శాతం తక్కువ ధరకు లభించనున్నాయి.కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరించి పీజీ అర్హత వైద్యుల నియామకాలకు పుదుచ్చేరి జిప్‌మర్‌ ఆధ్వర్యంలో ఇటీవలే ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తయింది. త్వరలో ఫలితాలు వెల్లడించనున్నారు. పలు రాష్ట్రాల నుంచి వైద్యులు వస్తుండడంతో వారికి తెలుగు భాషపై తర్ఫీదు ఇవ్వనున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు తెలుగులో చెప్పేది అర్థం చేసుకోవడం, వారికి తెలుగులో వివరించడానికి వీలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.