blog single post
Headlines

2018-12-06 05:45:23

అక్కడ పార్టీ పిరాయింపులు తప్పు అయితే… మరి ఇక్కడ ఒప్పా: వైఎస్ జగన్

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలోవైసిపి అధినేత జగన్  మాట్లాడుతూ … పక్క రాష్ట్రము తెలంగాణలో ఎన్నికలు జరిగితే , సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జర్గుతున్నటు ఆ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తిరుగుతున్నారని, ఏపీలో ప్రజా సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. అయితే  పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు ద్రోహులని తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని జగన్ ఎద్దేవా చేసారు .మా పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నదెవరని ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి, పక్క రాష్ట్రంలోకెళ్లి ఏం జరగనట్టుగా ఈ పెద్దమనిషి మాట్లాడారని, అబద్ధాలు చెప్పడంతో ప్రపంచ రికార్డును చంద్రబాబు బద్దలు కొట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.