blog single post
Headlines

2018-12-06 02:04:23

కియా సంస్థ రాకతో అనంతపురం జిల్లా దశమారిపోతుంది: సీఎం చంద్రబాబు

సచివాలయంలో ఎలక్ట్రిక్ కార్లను సీఎం ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు  మాట్లాడుతూ…కియా మోటార్ సంస్థ రాకతో అనంతపురం జిల్లా దశ మారిపోనుంది అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే ఎలక్ట్రికల్ కారులో మొదటిసారి నేను ప్రయాణించానని, ఇది సౌకర్యవంతంగా ఉందని తెలిపారు.కియా సంస్థ  మొదటి కారు జనవరిలో బయటకు వస్తుందని ఆశిస్తున్నా అని అన్నారు. ఇక్కడ తయారైన కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని, 10 శాతం ఎగుమతులకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.వివిధ పరిశ్రమల రాకతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారింది అని ముఖ్యమంత్రి తెలిపారు .

రాబోయే కాలంలో యూనిట్‌ సౌర విద్యుత్ రూపాయిన్నరకే లభ్యంకానుందని,ఆ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని వెల్లడించారు.అతిత్వరలో 7,300 ఎలక్ట్రిక్ వాహనాలను వ్యర్ధ సేకరణలో వినియోగిస్తామని చెప్పారు.పర్యావరణ అనువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్  ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.ఇది సరి కొత్త యుగం వైపు ప్రయాణానికి మొదటి అడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కియా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగపడుతుంది అని సీఎం అన్నారు.ఏపీకి పెట్టుబడులు పెద్దఎత్తున వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.వెలగపూడి సచివాలయంలో ఎలక్ట్రిక్ కార్లను సీఎం చంద్రాబాబు  ప్రారంభించగా నిరో హైబ్రిడ్‌, నిరో ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌, నిరో ఎలక్ట్రికల్‌ కార్లను ప్రభుత్వానికి కియా మోటార్స్ బహుమతిగా అందజేసింది.అయితే ఈ కార్లకు ఒక్కసారి ఛార్జింగ్‌ చేసుకుంటే 455 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు అని కియా సంస్థ పేర్కొంది .