blog single post
Headlines

2018-12-06 10:41:15

పంచాయతీల అభివృధ్దికి రూ.3,332 కోట్లు ఖర్చుపెట్టాo:మంత్రి లోకేష్

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం నియోజక వర్గాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటించి, పలు అభివృధ్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా భీమవరంలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ... ఏపీ తీవ్ర ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి లోటూ లేకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని మంత్రి లోకేష్‌ తెలిపారు. ఈ జిల్లాలో పంచాయతీల అభివృధ్దికి రూ.3,332 కోట్లు ఖర్చుపెట్టామన్నారు. భీమవరం నియోజకవర్గంలోనే రూ.150 కోట్లు పంచాయతీల అభివృధ్దికి ఖర్చు చేశామని చెప్పారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు భూగర్భ డ్రెయినేజీల వల్లే శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో మూడు మండలాలకు చెందిన ఆర్‌అండ్‌బి రోడ్ల సమస్యను ఆ శాఖా మంత్రి అయ్యన్నపాత్రుడి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ డాక్టర్‌ కాటంనేని భాస్కర్‌, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, పలువురు నేతలు పాల్గొన్నారు.