blog single post
Headlines

2018-12-05 04:21:54

ఈ నెల 27న కడప ఉక్కు కర్మాగారానికి పునాది వేస్తాం : సీఎం చంద్రబాబు

కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరిగిన 4వ జ్ఞానభేరి కార్యక్రమంలో  ముఖ్యమంత్రి మాట్లాడుతూ … ప్రజలకు సేవ చేయాలనే పట్టుదల, దృడసంకల్పంతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలంయలో చదువుతున్న రోజుల్లో నేను  ఐఎఎస్‌ కావాలనే కోరిక బలంగా ఉండేదని, ఐఎఎస్‌ కన్నా.. శాసనసభ సభ్యుడు అయితేనే ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం కలుగుతుందని కోరుకున్నాను. తిరుమల వెంకటేశ్వరస్వామి దయ వలన 1977- 78లో శాసనసభ్యుడినై రెండేళ్ల లోపే మంత్రి నయ్యానని సీఎం చంద్రబాబు చెప్పారు. పట్టుదల ఉంటే అనుకున్నది సాధించంచడం పెద్ద కష్టం కాదని ఇది కొందరి మేధావులు నిరూపించి చూపించారని వారిలో గాంధిమహాత్ముడు, అంబేద్కర్‌, అబ్దుల్‌ కలామ్‌, ఎన్‌టిఆర్‌ ఉన్నారు అని అన్నారు .జ్ఞానభేరి కార్యక్రమానికి జిల్లాలోనే వివిధ కాలేజిలనుండి 13వేల మంది విద్యార్ధులు పాల్గొన్నారు. 14 స్టాల్స్‌ను పరిశీలించిన అనంతరం 115.56 కోట్లతో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ప్రారంబోత్సవ, శంకుస్ధాపన శిలాఫలకాలను సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇందులో 6.19 కోట్లతో జమ్మలమడుగులో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను రూ కోటి ఖర్చుతో ప్రొద్దుటూరు కళాశాల హాస్టల్‌ను ప్రాంభించారు.అదే విధంగా వైవీయూకు సంబందిచి ఏడు పనులకు గాను 45. 59 కోట్లు, మూడు పాలిటెక్నిక్‌ కాలేజి ఎడ్యుకేషన్‌ పనులకు సంబందించి రూ 22.91 కోట్లు, వేములలో ఐటిఐ, ప్రొద్దుటూరులోని మైనార్టీ జూనియర్‌ కళాశాలకు 8.80 కోట్లు బి. మటంలో సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ స్కూల్‌కు 21.17 కోట్లు, రూర్బన్‌ కింద నందలూరులో రెండు పనులకు 4.90 కోట్లు, డిట్రిక్టు సెంట్రల్‌ లైబ్రరీ రీమోడల్‌కు రూ 5 కోట్లతో పలు అభివృద్ది కార్యక్రమాల శిలా ఫలకాలను ఆవిస్కరించారు. అనంతరం ప్రధాన వేధిక దగ్గరకు చేరుకున్న సిఎం జ్ఞానభేరి డోలు మోగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఒక నాయకుడికి మంచి బుద్ధి, జ్ఞానం ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కరువు జిల్లా అనంతపురానికి చెందిన సత్య నాదెండ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సంవత్సరానికి రూ.500 కోట్లు సంపాదిస్తున్నారు. తమిళనాడుకు చెందిన సుందర పిచాయ్‌ గూగుల్‌ సంస్థ సీఈవోగా పని చేస్తున్నారు.ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు వృద్ధిలోకి రావాలి అని ఆకాంక్షించారు.ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రతి విద్యార్థీ తెలుసుకోవాలన్నారు. ‘‘ఈ సీఎంకు ఏమీ తెలియదు అనుకునే వారు ఉన్నారు. హైదరాబాద్‌లో ట్రిపుల్‌ఐటీ ఆ రోజుల్లో పెడితే నేడు వాటి బ్రాంచ్‌లు ఏపీలో పెట్టారు.ఇదంతా మంచి ఆలోచన ఫలితమే. ఒక మంచి ఆలోచన ఇస్తే మరింత అభివృద్ధి దిశగా నడిచే అవకాశం ఉంటుంది. విజన్‌ లేకపోతే ఏమీ సాధించలేం. ఇన్నోవేషన్‌ అన్నది నిరంతర ప్రక్రియగా విద్యార్థుల్లో ఉండాలి. విద్యార్థులు రెండు నిమిషాలు ఆలోచన చేస్తే ఒక కొత్త విషయం వినూత్నంగా వస్తుంది’’ అని అన్నారు.

ఇన్నోవేషన్‌ వ్యాలీ నెలకొల్పి  అభివృద్ధి చేస్తాం ... !

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అనుసంధానం చేస్తూ ఇన్నోవేషన్‌ వ్యాలీ అభివృద్ధి చేస్తామన్నారు. ఈ వ్యాలీ కోసం విశాఖలో 50 ఎకరాలు కేటాయించామని చెప్పారు. పుట్టుకతో కాదు.. ఆచరణతోనే విలువలు వస్తాయన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మాటలు సదా శిరోధార్యమన్నారు. వయాడక్ట్‌ మంత్రాన్ని జపించడం నేటి విద్యార్థికి అవసరమని సీఎం తెలిపారు. తితలీ తుఫాను ఉత్తరాంధ్రను సర్వనాశనం చేసినా సాంకేతికతతో వారం రోజుల్లో సాధారణ పరిస్థితులకు తీసుకువచ్చామని సీఎం గుర్తుచేశారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి ఉంటుందన్న ఆలోచనతోనే పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు చేపట్టామన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేసేలా గట్టిగా ఆశీర్వదించాలని కోరారు. ‘‘మీ జీవితాలు మారాలన్నా, మీరు బాగుపడాలన్నా, నదుల అనుసంధానం జరగాలన్నా వయాడక్ట్‌తోనే సాధ్యం’’ అన్నారు.

టెక్సాస్‌ వర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం…!

అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సా్‌సతో జ్ఞానభేరి కార్యక్రమం వేదికగా సీఎం చంద్రబాబు ఎంవోయూ చేసుకున్నారు. ఆ యూనివర్సిటీలో చదువుతున్న మన వారికి రాయితీ కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని టెక్సాస్‌ వర్సిటీ ఆమోదించింది. మన విద్యార్థులకు రూ.ఏడు లక్షల వరకు రాయితీ ఇచ్చేలా.. ఇరు పక్షాల మధ్య కీలక ఒప్పందం ఖరారైంది. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి, ఆదినారాయణ, ఎంపీ సీఎం రమేశ్‌, కలెక్టర్‌ హరికిరణ్‌, వైవీయూ వీసీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.