blog single post
Headlines

2018-12-05 02:19:17

తాజా పరిణామాల పై స్పందించిన: ఉపరాష్ట్రపతి వెంకయ్య

తెలుగు రాష్ట్రాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అయితే రాజకీయాల్లో ఈ ధోరణి ప్రమాదకరమన్నారు.పార్టీలు మారిన శానసభ్యుల పై చర్యలు తీసుకోవడంలో శానసభ స్పీకర్లు ఆలస్యం చేయడం సరికాదని చెప్పారు.శాసనసభ్యుల పిరాయింపులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు అన్నారు.అయితే ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్లకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎన్నికల కేసులను త్వరగా పరిష్కరించాలని, ఆర్థిక నేరగాళ్లు దేశం దాటకుండా చర్యలు తీసుకోవాలని వెంకయ్య చెప్పారు.

అయితే ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు  ఇస్తున్న హామీలు చాలా విచిత్రంగాఉన్నాయి అన్నారు.కాగా అమలు సాధ్యంకాని హామీలు ఇవ్వడంపై రాజకీయ పార్టీలు ఆలోచించాలని సూచించారు. తమ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా హామీలు గుప్పిస్తున్నారన్నారు. అయితే ప్రజలు కులం, మతం, ధనంతో సంబంధం లేకుండా ప్రజలు ఓట్లు వేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గుణం, సామర్థ్యాన్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన అభివృద్ధి అవసరమని...అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని ఉపరాష్ట్రపతి   పేర్కొన్నారు.