blog single post
Headlines

2018-12-05 10:24:13

నేటితో ప్రచారానికి తెర!

చివరి అంకoలో వున్న తెలంగాణా, రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. వచ్చే ఏడాది మేలోజరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.శుక్రవారం ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే దశలో అన్ని స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ గడువు లోపే తమ గళంప్రజలకు చేర్చి వారిని ఆకట్టుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు అతిరథ మహారథులతో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.
48 గంటల పాటు బల్క్ మెసేజ్‌లు నిషేధం....
ఎన్నికల నిబంధనల నేపథ్యంలో నేటి రాత్రి 6 గంటల నుంచి 48 గంటల పాటు బల్క్ మెసేజ్‌ల(గ్రూపులు, గ్రూపులుగా)పై నిషేధిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఎవరైనా ఈరోజు సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో మెసేజ్‌లు పంపిస్తూ ప్రచారం నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠినంగా ఉంటామని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లు అంజనీకుమార్, సజ్జనార్‌లు హెచ్చరించారు.