blog single post
Headlines

2018-12-04 05:03:34

2019 లోక్‌సభ ఎన్నికలతో పాటుగా 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు

2019 జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. అయితే ఈ నాలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది మే, జూన్‌లో పదవీ కాలం ముగియాల్సి ఉంది.ఈ సందర్భంలోనే లోక్ సభతో పాటు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది అని తెలుస్తోంది.కాగా జమ్మూకశ్మీర్‌ శాసనసభను ఆ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ గత నెల 21న రద్దు చేశారు. అయితే ఆ రాష్ట్రానికి 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.కొన్ని రోజుల తేడాతో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే  జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికలను కూడా కలిపి నిర్వహించాలని భారత ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేస్తుంది.
లోక్‌సభ, శాసనసభకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల భద్రతా పరమైన సమస్యలు ఉండవని భావిస్తోంది.కాగా, మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఏడాది నవంబరు 2019 వరకు పదవీ కాలం ఉంది.ఒకవేళ ఈ రెండు రాష్ట్రాలు  6 నెలల ముందుగా శానసభను రద్దు చేస్తే సాధారణ ఎన్నికలతో పాటే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని,ఇలా చేయడం వల్ల 2019లో మరోసారి ఎన్నికల ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉండదని భారత ఎన్నికల సంఘం వర్గాలు భావిస్తున్నాయి.