blog single post
Headlines

2018-12-04 01:47:31

విశాఖపట్నంలో ఐటి హబ్‌ ఏర్పాటు : సీఎం

విశాఖపట్నంలో ఇంటెలిజెంట్‌ గ్లోబల్‌హబ్‌ ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ సీఎం  చంద్రబాబు చేసిన ప్రకటనను యునెస్కో స్వాగ తించింది. అయితే డిజిటల్‌ మేథా సంపత్తికి సంబంధించి ఐ హబ్‌ ఏర్పాటు చేసేందుకు విశాఖలో 50 ఎకరాల భూమిని కేటాయిస్తామని ఇటీవల ఆ నగరంలో జరిగిన టెక్‌-2018 సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. కాగా యునెస్కోకు అనుబంధంగా పనిచేస్తున్న మహాత్మాగాంధీ ఇన్స్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలెప్‌మెంట్‌  సంస్థ యునెస్కో సంచాలకులు ఆచార్య డాక్టర్‌ అనంత దురైయప్ప ఈ ప్రకటన పై స్పందిస్తూ … ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖను రాశారు. అయితే యునెస్కో ఎంజిఐఈపి ఏపి ప్రభుత్వంతో కుదుర్చుకున్న దీనిపై అవగాహన ఒప్పందం గ్లోబల్‌ డిజిటల్‌ విద్యా విధానాలను విస్తృతం చేస్తుందని ఈ లేఖలో ఆయన చెప్పారు.

ఏపీ ప్రభుత్వంతో కలిసి తాము ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమవుతున్నందుకు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు . ఏపి ప్రభుత్వం, యునెస్కో ఎంజిఐఇపి సంకయుక్తంగా ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్‌ విద్యావిధానాలను విస్తృత స్థాయిలో పనిచేసి అందరికి అందు బాటులోకి తీసుకొస్తారు. దీనిద్వారా డిజిటల్‌ రంగంలో భవిష్యత్తు అవసరాల కోసం నిష్ణా తుల్ని తయారు చేయడం సాధ్యపడనుది. ప్రపంచవ్యాప్తంగా వున్న ఇలాంటి డిజిటల్‌ మేథా సంపత్తికి ఒక వేదికను సమకూర్చి పరిశోధనలు చేయడానికి వీలు కలుగుతుంది.రానున్న కాలంలో విశాఖ నగరం ఇంటలిజెంట్‌ గ్లోబల్‌ హబ్‌గా రూపొందడానికి తమ ఉమ్మడి కృషిదోహదం చేస్తుంందని అనంత దురయప్ప ఈ సందర్భంగా పేర్కొన్నారు. సుమారు 700 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ గ్లోబల్‌ హబ్‌ ఏర్పాటు కానుంది. మొత్తం 5వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. నాలుగో పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో పాలన విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ విధానాలను ప్రవేశపెట్టి ఐటి, ఐఓటి ఆధారిత సేవలను ప్రోత్సహిస్తుంది.