blog single post
Headlines

2018-12-04 01:30:14

ముందస్తు ఎన్నికలు వల్లే తెలంగాణలో బరిలోకి దిగలేదు:పవన్

తెలంగాణలో అనుకున్న సమయంలో కాకుండా  ముందస్తు ఎన్నికలు రావడం వల్లనే అక్కడ జనసేన పోటీచేయడంలేదు అని , అదే 2019లో ఎన్నికలు వచ్చివుంటే అక్కడ కచ్చితంగా పోటీ చేసేవారిమని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగానే తెలంగాణలో  తమ పార్టీ కూడా బలమైన పాత్ర పోషిస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు అనంతపురం రూరల్‌ మండలం లోని ఎ.నారాయణపురంలో ధనుంజయ్య, సంజప్ప తదితర రైతుల పంట పొలాలను పవన్‌కళ్యాణ్‌ పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు.