blog single post
Headlines

2018-12-04 01:10:47

ముస్తాబు అయిన గన్నవరం విమానాశ్రయం

విజయవాడ  గన్నవరం విమానాశ్రయం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. ఈ విమాశ్రయం ఇక్కడి నుండి అంతర్జాతీయ విమాన సర్వీస్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ నుండి  సింగపూర్ కు విమానం బయలుదేరుతుంది. ఇందుకోసం ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.  ఈ  విమానా శ్రయంలో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేయనున్నారు. జీఆర్‌ఐహెచ్‌ఏ 4 స్టార్‌ సదుపాయాలతో ఈ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారు. టెర్మినల్‌ను మొత్తం 35 లక్షల చ.మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. రూ.611 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. గంటకు 1200 మంది ప్రయాణీకుల రాకపోకల సావర్థ్యంతో రూపొందించనున్నారు. ఇందులో దేశీయంగా గంటకు 800 మంది ప్రయాణికులు, అంతర్జాతీయంగా గంటకు 400 మంది ప్రయాణికులు వేర్వేరుగా రాకపోకలు సాగించే సామర్ధ్యం కలిగి ఉండేలా నమూనా రూపొందించారు. ఆధునిక టెర్మినల్‌లో మొత్తం 24 చెకిన్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. డిపార్చర్‌ ఏరియాలో ఒక బ్యాగేజీ కన్వేయర్‌ ఉంటుంది. నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను స్టీల్‌, గ్లాస్‌ల మేళవింపుతో నిర్మిస్తున్నారు. డబుల్‌ ఇన్సులేటెడ్‌ పైకప్పుతో పాటు, ఎనర్జీ ఎఫిషియన్సీ ఎయిర్‌ కండిషనింగ్‌, ఎల్‌ఈడీ లైట్లు, లో వీఓసీ పెయింట్‌, తక్కువ హీట్‌ గెయిన్‌ గ్లేజింగ్‌ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు