blog single post
Cinema News

2018-11-08 07:35:31

'టాక్సీవాలా' వేడుకకు ముఖ్యఅతిథిగా బన్నీ

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఉపుమీదున్న యువ కథనాయకులలో విజయ్ దేవరకొండ ఒకరు. విజయ్ తాజాగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. ఈచిత్రం 'గీతగోవిందం' కంటే ముందుగానే విడుదల చేయవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవలే ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 17వ తేదీన 'టాక్సీవాలా'ను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు ఈ నెల 11వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. 
గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రంను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేయనున్నాడు. మాళవిక నాయర్ .. ప్రియాంకా జువాల్కర్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో, కల్యాణి ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది.