blog single post
Cinema News

2018-11-08 03:00:58

నిర్మాతగా రాజమౌళి తనయుడు కార్తికేయ...

టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే...మనకు టక్కున వినిపించే పేరు దర్శక ధీర ఎస్.ఎస్. రాజమౌళి...ఆయన అంతగా తెలుగు ప్రేక్షకుల మనసులపై తనదైన ముద్ర వేశారు. అలాంటి దర్శకధీరుడి కుమారుడు కార్తికేయ నిర్మాతగా మరబోతున్నాడు. కార్తికేయకు  చిత్రానికి సంబంధించిన అన్ని విభాగాలపై మంచి పట్టుంది. తన తండ్రి రాజమౌళి చిత్రాలకి సంబంధించిన చాలా విషయాలను ఆయన దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. దాంతో రాజమౌళి మాదిరిగానే ఆయన మెగా ఫోన్ పట్టుకోవచ్చని అంతా అనుకున్నారు.దర్శకత్వంపై కార్తికేయకి ఆసక్తి వుందో లేదో తెలియదుగానీ, నిర్మాతగా మారడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం.కార్తికేయే స్వయంగా నిర్మించే ఈచిత్రంకి అశ్విన్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడు. అయితే అశ్విన్ .. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసినవాడే కావడం విశేషం. కార్తికేయ - అశ్విన్ కాంబినేషన్లో చారిత్రక నేపథ్యంలో రూపొందనున్న ఈచిత్రంకి 'ఆకాశవాణి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.  ఈ చిత్రంకు సంబంధించిన  పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.