blog single post
Cinema News

2018-11-08 10:28:43

'హిరణ్య కశిప' ఉంది..రానా నే హీరో,నిర్మాత: సురేష్ బాబు

రానా హీరోగా 'హిరణ్య కశిప' అనే చిత్రం గుణశేఖర్ తన దర్శకత్వంలో రూపొందనుందనీ, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రం నిర్మితం కానుందని మొన్నీమధ్య వార్త ఒకటి హల్ చల్ చేసింది. ఆ తరువాత ఈ చిత్రంకి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు. దాంతో ఈ చిత్రం లేనట్టేననే అని ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ ప్రాజెక్టు గురించే నిర్మాత సురేశ్ బాబు మాట్లాడారు. "ఈ చిత్రంకి సంబంధించిన పనుల్లోనే వున్నాము. దర్శకుడు గుణశేఖర్ వైపు నుంచి కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ పనులు 'లండన్' లో జరగనున్నాయి. ఈ చిత్రంకి రానాయే నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ చిత్రంను అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన వుంది. భారీ ప్రాజెక్టు కనుక ఆలస్యం అవుతోంది" అని ఆయన చెప్పుకొచ్చారు.