blog single post
Cinema News

2018-11-07 09:14:00

యుఎస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న #MB25

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా...వంశీ పైడిపల్లి దర్శకత్వంలో గత రెండు నెలలుగా అమెరికాలోని న్యూయార్క్‌లో మహేష్ తన 25వ చిత్రంగా వస్తున్న 'మహర్షి' చిత్రం నిరవధికంగా చిత్రీకరణ‌ జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఈ అమెరికా షెడ్యూల్‌లో తెరకెక్కించగా,.. ఇటీవలే ఈ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌ తరవాత, పూర్తి నిబద్ధత అంతా‌ చిత్రీకరణ పైనే పెట్టిన చిత్ర యూనిట్, త్వరలో చిత్రం ముగింపు దశకు తీసుకురాబోతున్నారు. అల్లరి నరేష్‌ ఆసక్తి కలిగించే పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ త్వరలో ప్రారంభంకానుంది. మహేష్‌ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. దిల్‌ రాజు, పివిపి. ప్రసాద్‌, అశ్వినిదత్‌ సంయుక్తంగా ఈ చిత్రంను నిర్మిస్తున్నారు.