blog single post
Cinema News

2019-04-15 03:06:26

'ఆర్ ఆర్ ఆర్' కి వాయిస్ ఓవర్ అందించనున్న ప్రభాస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' అనే చిత్రం తెరకెక్కుతుంది.ఇందులో బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది.మరొక నాయకిని ఎంపిక చేయాల్సి ఉంది.కాగా భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగిన కథలో విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్,రామ్ చరణ్ లు నటిస్తున్నారు.తాజాగా ఈ చిత్రంలో రెబెల్ స్టార్ ప్రభాస్ భాగం కాబోతున్నాడని సమాచారం.

ఈ చిత్రంలో  ఎన్టీఆర్,రామ్ చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ ప్రేక్షకులను అసలు కథలోకి తీసుకెళతారని చెబుతున్నారు.అయితే ఈ చిత్రంలోని ఈ రెండు పాత్రలను గురించిన వాయిస్ ఓవర్ రాజమౌళి సిద్ధం చేయించాడని తెలుస్తోంది.కాగా ఈ వాయిస్ ఓవర్ ను ప్రభాస్ తో చెప్పిస్తే మరింత జనరంజకంగా ఉంటుందనీ, అలానే ఈ  చిత్రానికి ఇది మరో అదనపు ఆకర్షణ అవుతుందని రాజమౌళి భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దర్శకుడు రాజమౌళి అడిగితే ప్రభాస్ కాదనడం జరగదు గనుక, ప్రభాస్ వాయిస్ ఓవర్ ఈ చిత్రంలో ఉండటం ఖాయమేనని చెబుతున్నారు.ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.