blog single post
Cinema News

2019-04-15 12:51:28

సల్మాన్ ‘భారత్’ ఫస్ట్ లుక్ విడుదల

సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా , అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో ‘భారత్’ అనే చిత్రం రూపొందుతోంది.తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది.కాగా సల్మాన్‌ వృద్ధుడిగా కనిపిస్తున్న ఈ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సల్మాన్‌ 20 ఏళ్ల యువకుడిగాను ,అలానే 70 ఏళ్ల వృద్ధుడిగాను ,వివిధ రకాల లుక్స్‌లో కనిపించనున్నారని తొలి నుండి చిత్రబృందం చెబుతుంది.

కాగా ఈనెల 24న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.ఓ దేశం, వ్యక్తి కలిసి చేసే ప్రయాణమే ఈ ‘భారత్’ చిత్రమని అంటున్నారు.ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తోంది.ఇందులో సల్మాన్‌ సోదరి పాత్రలో దిశా పటానీ కనిపించనుంది.ఏడాది రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది.ఈ చిత్రాన్ని హిందీతో పాటుగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందని సమాచారం.