blog single post
Cinema News

2019-04-15 11:28:51

నేడు విడుదల కానున్న ‘ఏబీసీడీ’ ట్రైలర్

అల్లు శిరీష్ కథానాయకుడిగా ,సంజీవ్ రెడ్డి  దర్శకత్వంలో ‘ఏబీసీడీ’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ కథానాయకిగా నటిస్తోంది.కాగా ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై రూపొందిస్తున్నారు.ఈ చిత్రాన్నిమే 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ఈ చిత్రానికి ‘అమెరిక్ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశి’ అనేది ఉపశీర్షిక  ఖరారు చేశారు.అయితే ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రంలో నాగబాబు, భరత్ తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు.