blog single post
Cinema News

2019-03-15 11:57:45

ఉగాదికి రానున్న ‘మహర్షి’ టీజర్

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ పూర్తి చేసుకుందని సమాచారం.అయితే మరో రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి ఉందని చెబుతున్నారు.ఏప్రిల్ లో ఈ పాటలను చిత్రీకరించడానికి ప్రణాళిక సిద్ధంచేశారు.

కాగా  'ఉగాది' కానుకగా ఏప్రిల్ 6వ తేదీన ఈ చిత్రం నుండి టీజర్ విడుదల చేయాలనే ఆలోచనలోచిత్రంబృందం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఈచిత్రానికి దిల్ రాజు ,అశ్వనీదత్ ,పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని మే 9వ తేదీన ఈ భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.