Cinema News

2019-03-14 02:41:36

తెలుగులో ఘనంగా అరంగ్రేటం చేయనున్న “ఆలియా”

ప్రతిష్టాత్మక ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ అందాల తార ఆలియా భట్ నటించబోతున్నారు. ఈచిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ సందర్భంగా తనకు చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు ట్విటర్‌ వేదికగా దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు.‘ఈరోజు నేను చాలా గొప్పగా ఫీలవుతున్నాను. అద్భుతమైన నటులతో, మిగతా బృందంతో కలిసి అందమైన ప్రయాణాన్ని ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తానా? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ రాజమౌళి సర్‌..’ అని పేర్కొన్నారు ఆలియా.ఎన్నో అంచనాల మధ్య ఈచిత్రం రూపొందుతోంది.