blog single post
Cinema News

2019-03-14 01:30:34

2020 జులై 30న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల..!

తెలుగులో అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కథా నాయకులుగా బాహుబలితో ప్రపంచ స్థాయి దర్శకుడిగా పేరుగాంచిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది.2020 జులై 30 ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్రానికి సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు సమాధానం ఇచ్చారు.ఈ చిత్రంలో బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌, డైసీ ఎడ్గర్‌ జోన్స్‌, సముద్రఖని, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తర్వాతి చిత్రీకరణను కోల్‌కతాలో జరుపుకోనుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి.