blog single post
Cinema News

2019-03-14 12:46:54

కార్తీ చిత్రంలో రష్మిక మందన

తెలుగులో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి ఆదరణ సంపాదించుకున్న కన్నడ నటి రష్మిక మందన తాజాగా తమిళ పరిశ్రమపై కూడా దృష్టి సారించింది.తాజాగా తమిళంలో  కార్తీ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది.ఈ చిత్రంలో కార్తీ సరసన రష్మిక నటిస్తోంది.నిన్న పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 'రెమో' చిత్ర దర్శకుడు బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వం వహించబోతున్నాడు.డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది.