blog single post
Cinema News

2019-02-11 03:40:24

#RRR అప్ డేట్ : అతిధి పాత్రలో అజయ్ దేవగణ్

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో  ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కథానాయకులుగా  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసింది.ఈ చిత్రానికి సంబంధించి రకాల రకాల వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్‌  చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో హిందీ నటుడు అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తాజా సమాచారం.

కాగా అజయ్ దేవగణ్  పాత్ర చిన్నదే అయినా ఆసక్తికరంగా ఉండబోతోందని ఆయన సన్నిహితులు మీడియాకు వెల్లడి చేశారు.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రాన్ని హిందీలో ‘మక్కీ’ పేరుతో అనువాదం చేశారు. ఈ చిత్రానికి అజయ్‌ దేవగణ్ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.అయితే అప్పటి నుండి రాజమౌళి, అజయ్‌ మంచి స్నేహితులయ్యారు.ఈ కారణం తోనే ఈ చిత్రంలో అజయ్‌కు అవకాశం ఇచ్చినట్లు సమాచారం.ప్రస్తుతం అజయ్‌ ‘తానాజీ’ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయ్యాక అజయ్ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో నటిస్తారని తెలుస్తోంది.డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.