ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రం తెరకెక్కుతుంది.తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదీని వర్మ ఖరారు చేశాడు.ఫిబ్రవరి 14న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను విడుదల చేస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.
కాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ స్పందిస్తూ..‘ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతిల మోస్ట్ డైనమిక్ లవ్ స్టోరీ ట్రైలర్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఉదయం 9.27 గంటలకు విడుదల చేస్తానని చెప్పారు.ఇది కుటుంబ కుట్రల చిత్రం అని ప్రత్యేక పోస్టర్ ను వర్మ విడుదల చేశాడు.