blog single post
Cinema News

2019-02-11 03:02:58

చిరు ‘సైరా’లో అల్లు అర్జున్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ,సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకం పై చిరు తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో  మెగా వారసురాలు నిహారిక ఓ పాత్రలో మెరవబోతున్నారని తెలుస్తోంది.కాగా చిత్రంలో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తాజాగా ఓ వార్త వినిపిస్తుంది.మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు అల్లు అర్జున్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు.కాగా అల్లు అర్జున్ కోరిక ఈ చిత్రంతో తీరబోతున్నట్లు తెలుస్తోంది.అయితే దీని పై చిత్ర బృందం నుండి ఇంకా అధికారక సమాచారం రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో నయనతార, తమన్నా కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు.అలానే ప్రముఖ హిందీ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌,జగపతిబాబు,విజయ్‌ సేతుపతి, సుదీప్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం తెలుగుతో పాటుగా  తమిళం,కన్నడ, హిందీ,మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.ఈ చిత్రాన్ని ఈ ఏడాది విజయదశమికి విడుదల చేయాలని చరణ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని సమాచారం.