blog single post
Cinema News

2019-02-11 12:02:50

‘మహానాయకుడు’లో నారా దేవాన్ష్

ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.మొదటి భాగాన్ని‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఇప్పటికే విడులైంది.ఇక ద్వితీయ భాగాన్ని ‘మహానాయకుడు’ పేరుతొ విడుదల చేయనున్నారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు.

కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పోషించినట్లు సమాచారం.అలానే ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్ తనయుడు శౌర్య రామ్ కూడా నటించినట్లు  తెలుస్తోంది.కాగా దేవాన్ష్‌కి సంబంధించిన చిత్రీకరణ కూడా కొద్ది రోజుల క్రితం పూర్తయినట్లు సమాచారం.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.