blog single post
Cinema News

2019-01-11 05:14:25

ఈ నెల 18 నుండి మొదలు కానున్న ‘భారతీయుడు‌-2’ చిత్రీకరణ

22 సంవత్సరాల క్రితం స్టార్ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో  కమల్‌హాసన్‌ నటించిన ‘భారతీయుడు‌’ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.కాగా ఈ చిత్రం రెండో భాగం చిత్రీకరణ ఈ నెల 18 నుండి ప్రారంభం కానుంది.ఈ చిత్రాన్ని లైకా సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది అని సమాచారం.ఈ చిత్రాన్ని సుమారుగా రూ.200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు.అయితే  ఈ చిత్రంలో కొరియా నటి బేయ్‌ సుజీ కూడా కీలక పాత్రలో నటించనున్నారు అని సమాచారం.

కాగా ఈ చిత్రాన్ని చెన్నై, పొల్లాచి, ఉక్రెయిన్‌, తైవాన్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారు అని తెలుస్తోంది.ఇప్పటికే  ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కానున్నాయి అని సమాచారం.ఈ చిత్రం కోసం అమెరికా నుండి మేకప్‌ నిపుణులు చెన్నై చేరుకున్నారు అని చెబుతున్నారు.ఈ చిత్రంలో కమల్‌హాసన్‌కు యువకుడు, వృద్ధుడిలా కనిపించేలా మేకప్ వేసి లుక్‌‌ ను పరీక్షించారు.కాగా ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు.దర్శకుడు  శంకర్‌ చిత్రాలంటేనే చిత్రీకరణకు ఎక్కువ సమయం పడుతుంది అని అంటారు. కానీ ఈ చిత్రంను మాత్రం 4 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు దర్శకుడు శంకర్‌.ఈ మే నెలలో చిత్రం విడుదల చేయాలనే దృఢసంకల్పంతో శంకర్ ఉన్నట్లు సమాచారం.