blog single post
Cinema News

2019-01-11 05:02:56

సెక్యూరిటీ కమాండర్ గా కనిపించనున్న “సూర్య”

‘రంగం’ చిత్రంతో  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కెవి ఆనంద్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం ‘కాప్పాన్’. ఇటీవల ఈచిత్రం రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈచిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఆయనకు సెక్యూరిటీ కమాండర్ గా సూర్య కనిపించనున్నాడు. బోమన్ ఇరానీ , ఆర్య , చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ  నిర్మిస్తుంది. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నఈ చిత్రంలో సూర్య సరసన సయేశా సైగల్ కథానాయికగా నటిస్తుంది.