blog single post
Cinema News

2019-01-11 12:37:18

కేజీఎఫ్-2 లో సంజయ్ దత్... !

కన్నడ నటుడు యశ్ కథయనాయకుడిగా తెలుగు,కన్నడ ,హిందీ భాషల్లో విడుదలైన 'కేజీఎఫ్' భారీ వసూళ్లను రాబట్టింది.కాగా విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లు సాధించింది.కొన్ని ప్రదేశాల్లో ఈ చిత్రం జోరు ఇంకా కొనసాగుతూ ఉండగానే, ‘కేజీఎఫ్-2’ సీక్వెల్ కిరంగం సిద్ధమైంది.కాగా ఈ చిత్ర నిర్మాత విజయ్ కిరంగన్ దుర్ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశాడు.

‘కేజీఎఫ్‘ 2వ భాగానికి సంబంధించి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ,రమ్యకృష్ణల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఒక ముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుందనీ కొత్తగా రూపొందించిన మరో శక్తివంతమైన పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు అని సమాచారం.ఇక తొలి భాగంలో చేసిన రవిశంకర్ అదే పాత్రలో 2వ భాగంలోను కొనసాగుతాడు అని సమాచారం.అయితే ఆయన ఈసారి మరింత శక్తివంతమైన పాత్రను తీర్చిదిద్దుతున్నట్టుగాతెలుస్తోంది.కాగా దుబాయ్ మాఫియా పై యశ్ చేసే ఎదురుదాడులు ఈ చిత్రానికి  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.