blog single post
Cinema News

2018-12-06 04:20:01

ఈ నెల 9న వరుణ్ తేజ్ ‘అంతరిక్షం' ట్రైలర్ విడుదల... !

మొదటి సారిగా తెలుగులో అంతరిక్షం నేపథ్యంలో సాగే కథాంశం ఉన్న చిత్రంలో వరుణ్ తేజ కథానాయకుడిగా నటిస్తుండగా ఈ చిత్రానికి  సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.కాగా ఈ చిత్రానికి అంతరిక్షం పేరు పెట్టారు . ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకేతించాయి . ఈ చిత్రం నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసే పనుల్లో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ చిత్రా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ జోడిగా కథానాయికలుగా లావణ్య త్రిపాఠి ,అదితీ రావు నటిస్తున్నారు.ఇంతకుముందు సముద్రం నేపథ్యంలో 'ఘాజీ' తీసి మెప్పించిన సంకల్ప్ రెడ్డి, 'అంతరిక్షం'తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దతున్నారు. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి చిత్రాలు చేసే అవకాశం వస్తుంది అని వరుణ్ తేజ్ అన్నారు .అందువలన ఈ చిత్రం తన సినీ జీవితంలో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు అని సమాచారం.