blog single post
Cinema News

2018-12-06 03:21:54

చైతూ కొత్త చిత్రంలో నిత్యామీనన్.. !

ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా 'మజిలి' అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి నిన్ను కోరి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.అయితే ఈ చిత్రం తరువాత చైతూ మేర్లపాక గాంధీతో కలిసి ఓ చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది.తన మొదటి చిత్రం  'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో విజయం సాధించిన మేర్లపాక గాంధీ .. 'కృష్ణార్జున యుద్ధం' చిత్రంతో నిరాశ పరిచాడు. ఇటీవల మేర్లపాక గాంధీ చైతూకి ఒక కథ వినిపించడం .. వెంటనే చైతూ ఒప్పుకోవండం జరిగింది అని సమాచారం. ఈ చిత్రంలో కథానాయకి పాత్రకి గాను నిత్యా మీనన్ అయితే బాగుంటుందని భావించిన మేర్లపాక గాంధీ .. ఆమెతో సంప్రదింపులు జరపడంతో  దాదాపుగా ఆమె ఆ పాత్రకి ఖాయమైంది అని అంటున్నారు. ఈ చిత్రంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది .ఈ చిత్రం కి సంబంధించిన అన్ని విషయాలు త్వరలోనే అధికారిక ప్రకటనచేస్తారు అని సమాచారం.