blog single post
Cinema News

2018-12-05 03:10:47

ఎఫ్ 2' లో ప్రత్యేక పాటలో నటించనున్న అనసూయ.. !

విక్టరీ వెంకటేశ్ .. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ఎఫ్ 2' కాగా … దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.అయితే ఈ చిత్రం చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో అనసూయ మెరవనున్నట్టు సమాచారం.అయితే ఈ పాటను  వెంకీ,వరుణ్ తేజ్, అనసూయల పై ఈ ప్రత్యేక పాటను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అని సమాచారం.

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ఈ పాటను  యువతనును .. మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. వెంకీ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడిగా మెహ్రీన్ లు నటిస్తున్నారు .  ఈ చిత్రంథియేటర్ లో నాన్ స్టాప్ నవ్వులు పూయిస్తుంది అని చెబుతున్నారు.అయితే దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలు సాధిస్తుండంతో, ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది