blog single post
Cinema News

2018-12-05 10:30:42

విక్రమ్.. 'మహావీర్ కర్ణ' ప్రారంభం!

కొద్దిరోజుల కిందట చియాన్ విక్రమ్ హీరోగా 'మహావీర్ కర్ణ' అనే భారీ బడ్జెట్ చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈచిత్రానికి సంబంధించిన ఏ విషయం తెలియకపోవడంతో ఈ చిత్రం లేదనే అభిప్రాయానికి చిత్ర అభిమానులు వచ్చారు. అయితే తాజా సమాచారం ఏమిటంటే...ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని తిరువనంతపురం .. అనంతపద్మనాభ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారుగానీ .. కొన్ని అనివార్యకారణాల వలన విక్రమ్ మాత్రం హాజరురాలేదు. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మించే ఈ చిత్రంకి ఆర్.ఎస్. విమల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 10 భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రంకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియనున్నాయి.