blog single post
Business News

2018-12-06 05:16:35

వచ్చే ఏడాది నుండి తమ కార్ల ధరలు పెంచనున్న మారుతి సుజికి

దేశంలోని అన్ని ఆటోమొబైల్‌ సంస్థలు వరుస బెట్టి ధరలుపెంచేస్తున్నాయి. తాజాగా దేశంలోనే  ప్రముఖ కార్ల ఉత్పత్తిదారు సంస్థ మారుతి సుజుకి వచ్చే ఏడాది నుండి ధరలు పెంచనున్నట్లు తెలిపింది.2019 జనవరి నుండి తమ అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.అయితే ఈ పెంపు ఎంతా అనేది ఇంకా స్పష్టం చేయలేదు.కాగా ఉత్పత్తి ఖర్చులు, కమోడిటీ ధరలు, రూపాయి విలువ పతనం తదితర కారణాల రీత్యా ధరలు పెంచాల్సి వచ్చిందని ఆ సంస్థవెల్లడించింది.ప్రస్తుతం మారుతి సుజుకి ఎంట్రీ లెవల్‌ ఆల్టో 800 నుండి  ప్రీమియం ఎస్‌-క్రాస్‌ వరకు విక్రయిస్తోంది.వీటి ధరలు రూ.2.53లక్షల మధ్య నుండి రూ.11.45లక్షల మధ్య వరకు ఉన్నాయి.అయితే అన్ని మోడళ్ల పై ధరలు పెంచనున్నట్లు ఇసుజు మోటార్స్‌ ఇండియా సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ ధరలు పెంపుకు ముందుగా టొయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ సంస్థ గత నెలలో అన్ని మోడళ్లపై 4శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.