blog single post
Business News

2018-11-08 07:50:10

రానున్న 15రోజుల్లో...మరో రూ.5/-తగ్గొచ్చు!

కొన్ని రోజులు నుంచి తగ్గుతూ వస్తున్న పెట్రోల్‌ ధర...రానున్న 15 రోజుల్లో మరో రూ.5 వరకూ తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు పరిమితులపై భారత్‌, చైనా, జపాన్‌ సహా 8 దేశాలకు మినహాయింపు ఇవ్వడమే దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగానూ ముడి చమురు బ్యారెల్‌కు 68 డాలర్లకు దిగిరావొచ్చని వెల్లడించారు. గత 18 రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.4.05 మేర క్షీణించింది.