blog single post
Business News

2019-02-11 04:18:18

నేడు నష్టాల్లోనే..!

నేటి సెషన్‌లో సెన్సెక్స్‌ 151 పాయింట్లు పతనమై 36,395 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 10,889 వద్ద స్థిరపడ్డాయి.100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఒక దశలో 220 పాయింట్లకు పైగా దిగజారింది. అటు నిఫ్టీ కూడా 70 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. అయితే చివర్లో సూచీలు కాస్త కోలుకున్నప్పటికీ నష్టాలు మాత్రం తప్పలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.19గా కొనసాగుతోంది.