blog single post
Business News

2019-02-09 04:03:51

ఈనెల 12 నుండి అందుబాటులోకి రానున్న నోకియా 5.1 ప్లస్‌

ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్థ నోకియా తన కొత్త  5.1 ప్లస్‌ స్మార్ట్ ఫోన్లో అధిక మెమరీ వేరియంట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.నోకియా 5.1 ప్లస్‌ ఫోన్‌ ఇప్పుడు 6 జిబి/64 జిబి అధిక మెమరీ వేరియంట్‌లో, అదే విధంగా 4 జిబి/64 జిబి వేరియంట్‌లోనూ లభ్యమవుతుందని హెచ్‌ఎండి గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌,కంట్రీ హెడ్‌ అజరు మెహతా చెప్పారు. వీటి ధరలను వరుసగా రూ.16,499, రూ.14,499గా నిర్ణయించామన్నారు.ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న నూతన నోకియా 5.1 ప్లస్‌ ఈనెల 12 నుండి ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ అవుట్‌ లెట్స్‌లో లభిస్తుంది.