blog single post
Business News

2019-02-08 04:14:29

అమ్మకాలతో మార్కెట్ బేజారు!

పలు కీలక రంగాల వాటాలలో అమ్మకాలతో  ఈరోజు 200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌  క్రమేపీ దిగజారుతూ వచ్చింది. ఏ దశలోనూ కోలుకోకుండా 425 పాయింట్లు పతనమై 36,546 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 126 పాయింట్ల నష్టంతో 10,944 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.19గా కొనసాగుతోంది.