blog single post
Business News

2019-01-11 04:58:18

హువాయి సంస్థ కొత్త స్మార్ట్ ఫోన్ 'హువాయి వి9' విడుదల

హువాయి ఇండియా సంస్థ నిన్న దేశ మార్కెట్లోకి తమ కొత్త స్మార్ట్ ఫోన్ హువాయి వి9 2019 విడుదల చేసింది.కాగా ఈ ఫోన్ ధరను రూ. 15,990గా నిర్ణయించింది. ఇంటిలిజెంట్‌ అల్గారిథమ్‌ను ఉపయోగించుకుని అత్యంత తక్కువ కాంతి లేదా బ్యాక్‌ లైటింగ్‌ కండీషన్‌లోనూ పోటోలు తీసుకునే అవకాశం ఉందని హువాయి బ్రాండ్‌ ఇండియా సంస్థ మేనేజర్‌ పాన్‌ యిన్‌ లాంగ్‌ తెలిపారు. 4.0 ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ టెక్నాలజీ కలిగిన ఈ ఫోన్‌ 15 జనవరి నుండి అమెజాన్‌లో లభ్యమవుతుందని చెప్పారు.


‘హువాయి వి9’ ప్రత్యేకతలు ఇవే :

  • 6.5 అంగుళాల డిస్‌ప్లే

  • 3డి కర్వ్డ్‌ డిజైన్‌

  • 4,000 ఎంఎహెచ్‌ బ్యాటరీ

  • 16 ఎంపి, 2 ఎంపి ఫ్రంట్‌ కెమెరాలు

  • 13 ఎంపి ఫ్లస్‌ 2 ఎంపి రియల్‌ డ్యూయల్‌ కెమెరా

  • ఇంటిలిజెంట్‌ అల్గారిథమ్‌

  • 4.0 ఫింగర్‌ ప్రింట్‌