blog single post
Business News

2019-01-11 04:13:55

నేడు కూడా నష్టాలతో ముగించిన దేశీయ మార్కెట్లు!

ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం సమయానికి  నష్టాల బాటలో పయనించాయి.ఇవాళ సెన్సెక్స్‌ 80 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా,నిఫ్టీ 10,800 పైన ఆరంభమైంది.చివరకు సెన్సెక్స్‌ 96.66 పాయింట్లు కోల్పోయి 36009.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.60 పాయింట్లు నష్టపోయి 10795 పాయింట్లకు చేరింది.డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.54 వద్ద ట్రేడవుతోంది.