blog single post
Business News

2019-01-10 04:42:14

నష్టాల బాటలో మార్కెట్లు..!

దేశీయ మార్కెట్లుఈరోజును  నష్టాలతో ముగించాయి. ఉదయం సమాంతరంగా ప్రారంభమైన సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. అయితే నిఫ్టీ మాత్రం 10,800 మార్కును ఉంచుకోగలిగింది. రూపాయి విలువ బలహీనపడడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. సెన్సెక్స్‌ 106.41 పాయింట్ల నష్టంతో 36,106.50 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 33.60 పాయింట్ల నష్టంతో 10821.60 పాయింట్లకు చేరింది.డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70.53 వద్ద కొనసాగుతుంది.