blog single post
editoryal

2019-03-21 06:45:02

పట్టభద్ర ఎన్నికలకు సర్వంసిద్ధం!

పట్టభద్ర ఎన్నికలకు ఓటు వేసే సమయం ఆసన్నమైంది.

ఓటు వేయడానికి వెళ్లేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఓటుకు వెళ్ళేటప్పుడు క్రింది వాటిలో ఏదో ఒక ఫోటో గుర్తింపు కార్డ్ పోలింగ్ బూత్ కు తప్పక తీసుకెళ్ళండి.

+  ఓటరు గుర్తింపు కార్డు

+ ఆధార్ కార్డు

+ ఫోటో ఉన్న డైవింగ్ లైసెన్స్

+ ఫోటో ఉన్న రేషన్ కార్డు, పాసపోర్ట్

+ పాన్ కార్డు, డిపార్ట్ మెంట్ గుర్తింపు కార్డు

+ ఫోటో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్

+ ఫోటో ఉన్న వికలాంగుల సర్టిఫికెట్, ఫోటో ఉన్న పట్టాదారు పాస్ బుక్

+ ఫోటో ఉన్న బ్యాంక్ ఎ.టి.యం. కార్డు, ఆస్తులకు సంబంధించిన రిజిష్టర్డ్ డాక్యుమెంట్.

 

తెలుసుకోదగినవి

 

మొదటి ప్రాధాన్యత క్రమం ఇవ్వదలచిన అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో 1 సంఖ్యను వేయాలి.

 

ఒకరికి 1 గుర్తించిన తరువాత మనకు ఇష్ట మైతే  మిగిలిన వారికి 2, 3, 4, ..... ప్రాధాన్యతలు గుర్తించవచ్చు, లేకపోతే 1 వేసి వదిలివేయవచ్చును.

 

ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయునపుడు నంబర్లను  ఒకటితో మొదలు పెట్టి వరుస క్రమంలోని అంకెలను మాత్రమే వేయాలి మధ్యలో అంకెను వదలి వేయరాదు.

 

ఒకరికి మాత్రమే 1 గుర్తించాలి. ఎక్కువమందికి 1 గుర్తిస్తే ఓటు చెల్లదు.  ఒక అంకె ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.

 

అంకెలు మాత్రమే వేయాలి. అక్షరాలు రాయకూడదు. రోమన్ అంకెలు (I,II,..) వేయకూడదు.

1, 2, 3 లు కాకుండా (√ , X) లాంటి ఇతర గుర్తులు పెట్టరాదు.

 

ఓటుకు పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన స్కెచ్ పెన్ ను మాత్రమే వాడాలి. మన దగ్గర ఉన్న పెన్ ను ఉపయోగించరాదు.

 

ఓటరు పేరు : ........

సీరియల్ నెం. : ...........

పోలింగ్ స్టేషన్ : ............

ఉన్న స్లిప్ ను తీసుకొని వెళ్లాలి.