blog single post
editoryal

2019-03-09 10:38:14

‘ఓటరు హెల్ఫ్‌లైన్‌’ యాప్ ద్వారా మీ వోట్ వివరాలు తెలుసుకోండి ఇలా..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్న విషయం ఓట్లు తొలగింపు దరఖాస్తుల వివాదం.కాగా ఓటర్లు తమ ప్రమేయం లేకండానే ఓటు తొలగించాలని వస్తున్న దరఖాస్తులు ఓటర్లని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఓటుకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఓ యాప్ ద్వారా ఎన్నికల సంఘం కల్పించింది.అయితే ఓటరు దగ్గర స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి ‘ఓటరు హెల్ఫ్‌లైన్‌’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.కాగా ఈ యాప్ లో సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ ఎలక్ట్రోల్‌ రోల్‌ పై క్లిక్‌ చేసి ఓటరు పేరు,తండ్రి పేరు,వయస్సు,నియోజకవర్గం,జిల్లా వంటి వివరాలు నమోదు చేయాలి.ఓటరు జాబితాలో మీ పేరు ఉంటే వెంటనే స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్ పై మీ ఓటుకు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి.ఓటరు గుర్తింపు కార్డు నంబరు తెలిసి ఉంటే ఆ నంబరును యాప్‌లో నమోదు చేయడం ద్వారా కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు అని తెలుస్తోంది.అయితే స్మార్ట్‌ ఫోన్‌ లేని ఓటర్లు టోల్‌ఫ్రీ నంబరు 1950 కు కాల్‌ చేస్తే వివరాలు తెలుస్తాయని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.

మీ ప్రమేయం లేకుండానే మీ ఓటు తొలగింపునకు గురైనట్లు తెలిస్తే ఈ యాప్‌ ద్వారానే ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఈ యాప్ ఉంది.అంతేకాకుండా కొత్తగా ఓటు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్ళకి ఫారం-6 ,ఓటు తొలగింపునకు ఫారం-7,అలానే ఓటు లో పొందుపర్చిన వివరాల మార్పునకు ఫారం-8...ఇలా అన్ని ఈ యాప్‌లోనే పొందుపర్చారు.ఎన్నికల సంఘం ప్రకటనలు,ప్రజలకు అందించే సందేశాలు యాప్‌లో ఎప్పటికప్పుడు  అందుబాటులో ఉంటాయి.లోక్ సభ , శాసనసభ సంబంధిత స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను,అలానే దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరుగుతున్న ఆ సమాచారం యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది.కాగా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఓటర్లు ఫిర్యాదు చేయవచ్చు.అలానే రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలకు అదనంగా వీవీ ప్యాట్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.అయితే వీటిని ఏవిధంగా వినియోగించాలని అన్న అంశాలపై కూడా ఈ యాప్‌లో అవగాహన కలిగించే  వీడియోలు పొందుపర్చారు. కాగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లినప్పటి నుండి తమ ఓటు వేసి బయటకు వచ్చే వరకు ఎలా వ్యవహరించాలన్న దానిపై లఘు చిత్రాలూ రూపొందించి యాప్ లో పొందుపర్చారు.