blog single post
editoryal

2019-03-08 09:59:28

ప్రతి వనితా నిత్య జీవిత విజేత!

ఇదో విజయ దశమి, మనిషి మనుగడ కోసం స్త్రీ అవసరాన్ని గుర్తించి స్మరించుకునే రోజు… అవని  మీద మనిషి అంటూ మిగలటానికి పురుషుని తో సమానంగా స్త్రీ అవసరం అన్న నిజాన్ని గుర్తు చేసే రోజు.. అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు. ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ మరియు మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ మరియు సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచేవిధంగా ఈరోజును జరుపుతారు.

పూర్వ వృత్తాంతం:

ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. చికాగోలో 1908 మే 3; న్యూయార్క్లోఫిభ్రవరి 28, 1909 మరియు ఫిభ్రవరి 27, 1910 రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910 లో, అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది. అమెరికాసామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు. 17 దేశాలనుండి వచ్చిన 100 మహిళలు మహిళలకు ఓటుహక్కుతో పాటు సమానహక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు. తదుపరి సంవత్సరం 1911 మార్చి 19న పదిలక్షలమందిపైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19 న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో300 పైగా ప్రదర్శనలు జరిగినవి. వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు. మహిళలు ఓటుహక్కు మరియు ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు. అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు మరియు మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడినవి. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావంవలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుబడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం మరియు నేతృత్వం వహించడం మెరుగుపడవలసివుంది.

 

ప్రపంచంలో విభిన్న రంగాలలో దూసుకుపోతున్నా .. గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తించే ప్రతి తల్లి కూడా నిత్య జీవిత విజేతే........ నవయువగళం