blog single post
editoryal

2019-02-19 09:58:34

భారత హృదయ సామ్రాట్…!

భారత  మాత ముద్దుబిడ్డ  మహాయోధుడు ఛత్రపతి  శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన స్మృతులను స్మరించుకుంటూ  … ఆయన జీవితం లోని కొన్ని స్ఫూర్తి వంతమైన ఘట్టాలను పాఠకుల ముందుకు ….

 

సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసాడు.

 

ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విదంగా గౌరవించబడ్డారు.

 

నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయి.

 

#శివాజీమరాఠాసైన్యం

 

మరాఠా సామ్రాజ్యం ముగిసేవరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. గెరిల్లా యుద్ధ విధానం శివాజీతోనే మొదలయింది. కొత్త ఆయుధాలను కనుగొని వాటితో యుద్ధాలు చేయించడం శివాజీకి ప్రత్యేక అభిరుచి. పటిష్ఠమయిన నౌకా దళాన్ని, ఆశ్వికదళాన్ని ఏర్పాటు చేసాడు. ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలను అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాలవారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ.

 

శివాజి వ్యక్తిత్వం ప్రముఖంగా నలుగురు గురువుల సాంగత్యంలో సాగింది. వీరందరి శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, మేథావి అయ్యాడు.

 

మొదటి గురువు జిజియా బాయి. బాల్యంలో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమ వంతుడిగా తీర్చిదిద్దాయి.

 

రెండవ గురువు దాదాజీ కొండదేవ్. దగ్గర రాజకీయం, యుద్ద తంత్రం నేర్చుకున్నాడు.

 

మూడవ గురువు తుకారామ్. వీరి దగ్గర సామాజిక సమరసత నేర్చుకున్నాడు శివాజీ.

 

నాల్గవ గురువు సమర్థ రామదాసు. వీరి దగ్గర ఆధ్యాత్మికత, హైందవ పరిరక్షణనే జీవిత పరమార్థమనే విషయాన్ని నేర్చుకున్నాడు. ఈ విధంగా శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్ఠమైనదిగా తీర్చి దిద్ద బడింది.

 

నవాబు కి దండం పెట్టని శివాజి.

 

షాజీ, తన పని చేస్తున్న బీజాపూర్ సుల్తాన్ దర్బారుకి తీసుకి వెళ్ళాడు. 12 సం.ల శివాజిని కూడా తీసుకు వెళ్ళాడు తండ్రి. సుల్తాన్‌కి సలాము చేసిన తండ్రి కొడుకుని కూడా సలాము చేయమన్నాడు తండ్రి. “పరాయ రాజుకు ముందు వంగి సలాము చేయను” అన్నాడు శివాజి. తండ్రి శివాజీ ధైర్యాన్ని మనసులోనే అభినందించాడు. బాల్యం నుండి అంతడి దేశ భక్తి, జాతీయాభిమానం కలిగిన వాడిగా తీర్చిదిద్దింది ఆయన తల్లి జిజియా బాయి.

 

ఆవు – శివాజి

 

ఒక నాడు ఒక ముస్లిము ఒక ఆవుని వధించడానికి లాక్కుపోతుండగా చూసాడు శివాజి. 10 సం. కూడా నిండని శివాజి ఆ ముస్లిముతో ఆవుని విడిచేదాకా వాదులాడాడు. కబేళాకి తరలిపోతున్న ఆవుని విడిపించాడు.

 

శివాజి – తోరణ దుర్గ కోట విజయం

 

16 సం. ప్రాయంలోనే శివాడీ తోరణ్ కోట (దుర్గా)న్ని జయించాడు. ఈ విజయంతో శివాజీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. కొండదేవ్ శిక్షణని అంత అద్భుతంగా ఒడిసి పట్టాడు శివాజి.

 

శివాజి – తల్లి కొరిక శింహ ఘడ్

 

చదరంగంలో ఓడిపోయిన శివాజీని ముస్లిముల ఆధిపత్యంలో ఉన్న సింహ ఘడ్‌ని బహుమతిగా ఇమ్మంది తల్లి. పుత్రుడి పెళ్ళి పనిలో నిమగ్నమైన తానాజీని పిలిపించాడు. తల్లి కొరికని చెప్పాడు. వెంటనే సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు తానాజీ. భయంకర యుద్దం చేసి కోటని స్వాధీనం చేసుకున్నారు సైనికులు. తానాజీ వీరమరణం పొందాడు. “సింహ గడ్ లభించించి కాని సింహం పోయింది” అన్నాడు శివాజి. కొడుకు పెళ్ళిని కూడా లెక్క చేయాక శివాజీ ఆజ్ఞని సిరసావహించి, వీరమరణం పొందిన ఈ ఉదంతం శివాజీ మాటకి అతడి సైనికులో ఎంతటి విలువ ఉందో తెలియ జేస్తుంది.

 

#శివాజిఆంధ్రపర్యటన

 

1677 లో భాగ్యనగర్ వచ్చిన శివాజి, అక్కడ నుండి శ్రీశైలం వెళ్ళి అష్టాదశ పీఠాలలో ఒకటైన బ్రమరాంబ దేవిని దర్శించాడు. ఆమెకి తన శిరస్సుని బలిగా ఇద్దామని ప్రయస్తున్న శివాజికీ అమ్మ ప్రత్యక్షమై- నీ శిరస్సుని నా కెందుకు. నీ అవసరం దేశానికి చాలు ఉంది. నీ మెధస్సుని, క్షాత్రాన్ని, ధర్మ రక్షణకై వినియోగించు అని పలికిన అంబ శివాజీకి ఒక ఖడ్గాన్ని కానుకగా ఇచ్చింది. శివాజి శేష జీవితాన్ని ధర్మ రక్షణకై వినియోగించారు. ఈ ఉదంతంతో, హైందవ పరిరక్షణ బాధ్యతని దైవమే స్వయంగా శివాజీకి ఇచ్చిందని తెలుస్తుంది.

                                                                ఇటువంటి అనుసరణీయుల త్యాగాలను వారి నిండైన వ్యక్తిత్వాలను రానున్న తరాలకు దిక్సూచిలా ఉపయొగపడాలనే సంకల్పంతో-----------------నవయువగళం