blog single post
editoryal

2019-01-31 08:54:14

తెలుగు సంగీత గమనంలో వేటూరి దారి!

సాహిత్యం కొత్త ఒరవడి తొక్కింది ఆయన నుంచే..

ఆయన కలం కదిపితే చాలు వేల భావాలు వచ్చి తేనెతుట్టెలా ఒదిగిపోతాయి.

భక్తి ని రక్తి ని ఏకకాలంలో అస్త్రాలుగా మార్చి మన మనస్సులపై విసిరే చాతుర్యం ఆయనది. ఆయన పదాలు వింజామరలై తెలుగు సినీ జగత్తుని చల్లగా ఏలాయి.

రాతతోనే గుండెని కోయగలడు, ఆ గాయపడిన గుండెలకు ఓదార్పుని, ప్రేమను,విరహాన్ని,ఉత్తేజాన్నివ్వగలడు  ఒకటేమిటి అన్నీ రసాల భావాలని ఔపాసనం చేసి రాయగల సత్తా ఆయన కలానిది.

అన్నమయ్య సినిమాలో ఏది ఆయన రాసిందో, ఏది అన్నమయ్య రాసిందో గుర్తుపట్టడం కాసింత కష్టమే నేటి తరానికి!

ఆయనే "వేటూరి సుందరరామ్మూర్తి".

తిరుపతి లడ్డంటి తియ్యగా చెప్పాల్సిన భావాన్ని చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.

కమర్షియల్ పంధాలో సైతం ఆయన పదాలు విజయంవైపు సినిమాను లాక్కెళ్లాయనేది సత్యం.

ఆయన జయంతి సందర్భంగా కీ.శే. వేటూరి సుందరరామ్మూర్తి గారిని స్మరించుకుంటూ..

 

గుర్రం జాషువా గారు చెప్పినట్లు,

 

"రాజు మరణించె నొకతార రాలిపోయె

కవియు మరణించె నొకతార గగనమేగె

రాజు జీవించు రాతి విగ్రహములందు

సుకవి జీవించు ప్రజల నాల్కల యందు’’ ..

 

కవికి మరణం లేదు.

వేటూరి వారు పాట రూపంలో మన మధ్యనే ఉంటారు.

మనతోనే ఉంటారు!! 

     ----------------నవయువగళం